స్వర్ణభారత్ ట్రస్ట్‌కు నేడు యూపీ సీఎం రాక
ABN , Publish Date - Sep 07 , 2026 | 05:54 AM
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కు రానున్నారు.
వెంకటాచలం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు సరస్వతీ నగర్ వద్ద ఉన్న అక్షర విద్యాలయం అర్జున్ మైదానంలోని హెలిప్యాడ్‌కు ఆయన చేరుకుంటారు. అక్షర విద్యాలయం, సోమా స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 1.45 గంటలకు రోడ్డు మార్గ్గాన ప్రత్యేక కాన్వాయ్‌లో బయలుదేరి వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కు చేరుకుని, అక్కడ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
ఈ వార్తలను కూడా చదవండి
ధారకొండ ఘాట్ రోడ్డులో ప్రమాదం
వెంకటేశ్వరకాలనీలో కార్డన్‌సెర్చ్