Share News

వెంకటేశ్వరకాలనీలో కార్డన్‌సెర్చ్‌

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:31 PM

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలోగల వెంకటేశ్వరకాలనీలో కాశీబుగ్గ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆదివారం కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు.

వెంకటేశ్వరకాలనీలో కార్డన్‌సెర్చ్‌
వెంకటేశ్వరకాలనీలో పత్రాలను పరిశీలిస్తున్న పోలీసులు:

పలాస, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలోగల వెంకటేశ్వరకాలనీలో కాశీబుగ్గ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆదివారం కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. కాలనీని పోలీసులు చుట్టుముట్టి ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఎటువంటి పత్రాలు లేని మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంద ర్భంగా సీఐ, ఎస్‌ఐలు విలేకరులతో మాట్లాడుతూ ద్విచక్రవాహనాలకు సం బంధిత అనుమతి పత్రాలతోపాటు లైసెన్స్‌లు కలిగి ఉండాలని తెలిపారు. కార్డన్‌సెర్చ్‌ వల్ల అసాంఘిక శక్తులు బయట నుంచి రాకుండా నిలువరించ వచ్చని, అనుమానిత వ్యక్తుల సమాచారం కూడా లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కాశీబుగ్గ సబ్‌డివిజన్‌ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 11:31 PM