తునిలో 125 కేజీల గంజాయి స్వాధీనం.. రవాణా ముఠా అరెస్ట్..
ABN , Publish Date - Sep 17 , 2026 | 07:35 PM
కాకినాడ జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి రవాణా చేస్తున్న ఓ ముఠాను తుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితుల నుంచి 125 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కాకినాడ, సెప్టెంబర్ 17: జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను తుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితుల నుంచి రూ. 65 లక్షలు విలువ చేసే 123 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడలోని తుని జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి రవాణా జరుగుతోందనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తుని పరిధిలోని సీతారాంపురంలో గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 125 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 62.50 లక్షల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు.
అనంతరం.. నిందితుల నుంచి రూ.3.41 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన కారు, ఆటో, రెండు మోటార్ సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వారికి గంజాయి ఎక్కడి నుంచి లభించింది..? ఎవరికి విక్రయిస్తున్నారు..? ఇందులో ఎవరెవరు భాగస్వాములై ఉన్నారు.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జోసెఫ్ రావణ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు
ప్రతీ ఆశీర్వాదం నా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది: ప్రధాని మోదీ
For More AP News And Telugu News