Share News

విషాదంతో ముగిసిన ట్రయాంగిల్ ప్రేమ.. ఇద్దరు యువతుల ఆత్మహత్య

ABN , Publish Date - Sep 16 , 2026 | 07:41 PM

పోలవరం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ట్రయాంగిల్ ప్రేమ వ్యవహారం విషాదంతో ముగిసింది. ఒకే వ్యక్తిని ప్రేమించిన ఇద్దరు యువతులు.. ప్రియుడి కోసం ఘర్షణ పడి చివరికి ఆత్మహత్య చేసుకున్నారు.

విషాదంతో ముగిసిన ట్రయాంగిల్ ప్రేమ.. ఇద్దరు యువతుల ఆత్మహత్య
tragedy triangle love

పోలవరం, సెప్టెంబర్ 16: జిల్లాలోని దేవీపట్నం మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ట్రయాంగిల్ ప్రేమ వ్యవహారం విషాదంతో ముగిసింది. ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ప్రాణం తీసుకున్నారు.


స్థానికులు, బంధువుల కథనం మేరకు.. దేవీపట్నం మండలంలోని దామనపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మి, బోర్నగూడెం గ్రామానికి చెందిన మంగ అనే ఇద్దరు యువతులు ఒకే వ్యక్తిని ప్రేమించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ఇద్దరు యువతుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కాగా.. ప్రేమించిన వ్యక్తి తనకు దక్కడేమో అన్న భయంతో వరలక్ష్మి 13వ తేదీన నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. మరో యువతి మంగ ఈ రోజు (బుధవారం) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమే వీరిద్దరి ఆత్మహత్యలకు కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

ఆ ఇద్దరూ కలిసి మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారు: మంత్రి శ్రీధర్ బాబు

యువ క్రీడాకారులకు జ్యోతి యర్రాజీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 08:11 PM