తిరుపతిలో దారుణం.. డాక్టర్‌ను గొంతులో పొడిచిన కానిస్టేబుల్
ABN , Publish Date - Jun 10 , 2026 | 09:09 AM
తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లిలోని మద్యం దుకాణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తిరుపతి, జూన్ 10: తిరుపతి రూరల్ మండలంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక పోలీసు కానిస్టేబుల్.. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి తోటి స్నేహితుడైన వెటర్నరీ డాక్టర్‌పై మద్యం సీసాతో దాడికి తెగబడ్డాడు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఉప్పరపల్లిలోని మద్యం దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటరమణ.. ఓ వెటర్నరీ డాక్టర్‌తో కలిసి ఉప్పరపల్లిలోని మద్యం దుకాణానికి వెళ్లాడు. అక్కడ వారిద్దరూ కలిసి మద్యం సేవించారు. అయితే, ఇద్దరి మధ్య ఏదో విషయమై వాగ్వాదం మొదలైంది. మాటా మాటా పెరిగి వివాదం కాస్తా ముదరడంతో ఇద్దరూ పరస్పరం భౌతిక దాడికి దిగారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన కానిస్టేబుల్ వెంకటరమణ.. అక్కడే ఉన్న మద్యం సీసాను పగలగొట్టి దాంతో వెటర్నరీ డాక్టర్ గొంతుపై బలంగా పొడిచాడు.
ఈ దాడిలో వెటర్నీ డాక్టర్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అనంతరం కానిస్టేబుల్ వెంకటరమణ స్థలం నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన వెటర్నరీ డాక్టర్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ పోలీసులు.. పరారీలో ఉన్న కానిస్టేబుల్ వెంకటరమణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News