Share News

కొంపముంచిన రూ. 370 బిర్యానీపై కామెంట్లు.. ఇలా జరుగుతుందని అనుకోలేదు..

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:46 PM

బిర్యానీపై చేసిన కామెంట్ల కారణంగా ఓ వ్యక్తి కొంపమునిగింది. ఆడవారి గురించి అభ్యంతరకరంగా మాట్లాడాడన్న కారణంతో అతడి ఉద్యోగం పోయింది.

కొంపముంచిన రూ. 370 బిర్యానీపై కామెంట్లు.. ఇలా జరుగుతుందని అనుకోలేదు..
₹370 Ki Biryani controversy

ఇంటర్‌నెట్ డెస్క్: బిర్యానీపై చేసిన కామెంట్ల కారణంగా ఓ వ్యక్తి కొంపమునిగింది. ఆడవారి గురించి అభ్యంతరకరంగా మాట్లాడాడన్న కారణంతో అతడి ఉద్యోగం పోయింది. ఆ వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌కు చెందిన హిమాన్షు జంగ్ర అనే వ్యక్తి ‘స్టార్విక్ డిజైన్’ అనే కంపెనీలో పని చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడు కమెడియన్ ప్రణీత్ మోరే షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అమ్మాయితో డేటింగ్ గురించి మాట్లాడుతూ.. అమ్మాయికి రూ. 370 బిర్యానీ తినిపిస్తే.. ఆమె నుంచి రిటర్న్ గిఫ్ట్‌గా శారీరక సుఖాన్ని కోరుకుంటానని అన్నాడు. ఆడవాళ్లపై మరిన్ని దారుణమైన కామెంట్లు చేశాడు.


ఈ కామెంట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు హిమాన్షుపై ఫైర్ అవ్వటం మొదలెట్టారు. దీంతో భయపడిపోయిన హిమాన్షు సారీ చెప్పాడు. తన సోషల్ మీడియా అకౌంట్‌ను డిలీట్ చేశాడు. అయినా రచ్చ ఆగలేదు. ఈ వివాదం స్టార్విక్ కంపెనీ అధినేత వివేక్ విశ్వకర్మ దగ్గరకు వెళ్లింది. ఆయన అన్ని రకాలుగా విచారణ చేయించి.. హిమాన్షును ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో సోమవారం ఓ వీడియో పెట్టారు. తప్పులకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

రయ్‌.. రయ్‌.. హైవేలో బైక్‌ విన్యాసాలు

ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!

Updated Date - Jun 09 , 2026 | 02:03 PM