Share News

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

ABN , Publish Date - Oct 04 , 2026 | 04:46 AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోగా, క్యూలైన్‌ దాదాపు మూడు కిలోమీటర్ల మేరకు విస్తరించింది.

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమల, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాలు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, గదుల కేటాయింపు కేంద్రాలు, అన్నప్రసాద భవనం, ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్లు, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు, యాత్రికుల వసతి సముదాయాలు కిటకిటలాడుతున్నాయి. ఇక, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండుగా ఉన్నాయి. క్యూలైన్‌ దాదాపు మూడు కిలోమీటర్ల మేరకు పాచికాల్వ గంగమ్మ ఆలయం వరకు వ్యాపించింది. భక్తులు క్యూలైన్‌లో ఇబ్బందిపడకుండా విడతలవారీగా లోపలకు అనుమతిస్తున్నారు. అలాగే తోపులాటలు లేకుండా క్యూలైన్లలోనే కంపార్టుమెంట్లుగా ఏర్పాటు చేసి దర్శనానికి పంపుతున్నారు. సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. అలాగే టైంస్లాట్‌ భక్తులకూ దాదాపు మూడు గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 04:46 AM