Share News

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , Publish Date - May 02 , 2026 | 12:18 AM

‘ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకొని వారికి సేవ చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తామ’ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
Ram Mohan Naidu

  • కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

పలాస రూరల్‌, మే 1(ఆంధ్రజ్యోతి): ‘ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకొని వారికి సేవ చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తామ’ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శుక్రవారం పలాస మండలం రామకృష్ణాపురంలో లబ్ధిదారులకు సామాజిక పింఛన్లను కేంద్రమంత్రి పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పథకాల పంపిణీ, ప్రభుత్వ పనితీరుపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు నేరుగా అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష, టీడీపీ నాయకులు కుత్తుమ లక్ష్మణకుమార్‌, జిల్లా గ్రంథాలయం చైర్మన్‌ పీరికట్ల విఠల్‌రావు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 07:54 AM