AP CID: శ్రేయ గ్రూప్ కేసులో దూకుడు పెంచిన ఏపీ సీఐడీ.. నోటీసులు జారీ
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:13 PM
అమాయక ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపించి కోట్లు కొల్లగొట్టిన శ్రేయా గ్రూప్ ఆర్థిక కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఆ సంస్థ యజమానుల వ్యక్తిగత ఆస్తులను కూడా జప్తు చేసేందుకు సిద్దమైంది.
కర్నూల్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh )లో సంచలనం సృష్టించిన శ్రేయా గ్రూప్ (Shreya Group) ఆర్థిక కుంభకోణం (Financial scandal)కేసులో ఏపీ సీఐడీ (AP CID) దర్యాప్తు వేగవంతం చేసింది. అధిక వడ్డీ ఆశ చూపించి 8,128 మందికి పైగా ప్రజలను మోసం చేసి సుమారు రూ.206 కోట్లు దండుకున్న శ్రేయా గ్రూప్స్ సంస్థపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. శ్రేయా గ్రూప్ సంస్థతో పాటు ఆ సంస్థ యజమానుల వ్యక్తిగత ఆస్తులను జప్తు (Attachment) చేసేందుకు ఏపీ ప్రభుత్వం సీఐడీ అధికారులకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభించింది.
శ్రేయా గ్రూప్ సంస్థతో పాటు యజమానుల వ్యక్తిగత ఆస్తులను కూడా జప్తు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐడీకి అధికారికంగా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలోనే బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. కర్నూల్ జిల్లాలో జూపాడు బంగ్లా మండలంలోని పాలమూరు గ్రామంలో ఉన్న 51.55 ఎకరాల భూమిని అటాచ్ చేయడానికి సీఐడీ అధికారులు తహసీల్దార్ కార్యాలయానికి నోటీసులు పంపినట్లు తెలుస్తుంది. సీఐడీ నోటీసులతో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నింధితులు పరారీలో ఉండగా వారి కోసం పక్క రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై పన్ను కోత.. యోచనలో జీఎస్‌టీ కౌన్సిల్
గాల్లో చక్కర్లు కొట్టిన సింగపూర్ ఇండిగో ఫ్లైట్.. అరగంట తర్వాత..
Read Latest AP News And Telugu News