Share News

సీఈసీ జ్ఞానేశ్‌... బీజేపీ కార్యకర్త: షర్మిల

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:25 AM

‘కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ బీజేపీ కార్యకర్తగా, ప్రధాని మోదీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు’

సీఈసీ జ్ఞానేశ్‌... బీజేపీ కార్యకర్త: షర్మిల

అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ‘కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ బీజేపీ కార్యకర్తగా, ప్రధాని మోదీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. శనివారం జ్ఞానేశ్‌ రాజీనామా కోరుతూ ఆమె ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ‘దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించడం దుర్మార్గపు చర్య. జ్ఞానేశ్‌ రాజీనామా చేయాలి లేదా తొలగించాలి. విచారణ జరిపి అరెస్టు చేయాలి. పవిత్రమైన ఓటును బీజేపీ చోరీ చేస్తోంది. మోదీ ఓట్ల గజదొంగ. ఈసీ మోదీ చెప్పుచేతల్లో పనిచేస్తోంది’ అని షర్మిల ఆరోపించారు.

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 05:25 AM