Share News

దార్శనిక నేత చంద్రబాబు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు

ABN , Publish Date - Aug 13 , 2026 | 07:10 AM

ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప దార్శనిక నాయకుడని, మంచి మనసున్న వ్యక్తి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని అద్భుతంగా, పరిపూర్ణంగా తీర్చిదిద్దడం ఆయనకే చెల్లిందని, అభివృద్ధికి ఆయన చిరునామా అని అన్నారు.

దార్శనిక నేత చంద్రబాబు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు

న్యూఢిల్లీ, (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప దార్శనిక నాయకుడని, మంచి మనసున్న వ్యక్తి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని అద్భుతంగా, పరిపూర్ణంగా తీర్చిదిద్దడం ఆయనకే చెల్లిందని, అభివృద్ధికి ఆయన చిరునామా అని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతితో పాటు ప్రజా సంక్షేమాన్ని అందించడంలో ఆయన శైలి అసాధారణమని రాష్ట్రపతి పేర్కొన్నారు. విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో బుధవారం ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతి విశేషాలతో రూపొందించిన ప్రత్యేక కాఫీ టేబుల్‌ బుక్‌ను కలిశెట్టి రాష్ట్రపతికి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. మంత్రి నారా లోకేశ్‌ విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని కలిశెట్టి కుమార్తె నిఖిల.. రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. సంభాషణ మధ్యలో ఎంపీ కలిశెట్టి.. తాను సామాన్య గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చానని చెప్పగా.. రాష్ట్రపతి స్పందిస్తూ.. ‘నేను కూడా సమాజంలోని అత్యంత దిగువ స్థాయి నుంచి, సామాన్య నేపథ్యం నుంచే ఈ స్థాయికి చేరుకున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లే ఉంది’ అని అన్నారు.


కుట్రలు చేయడమే వైసీపీ నేతల పని: కలిశెట్టి

సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని వైఎస్‌ జగన్‌ ఆసూయతో రగిలిపోతున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు కుట్రలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపిం చారు. ఏపీ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లా డుతూ వైఎస్‌ జగన్‌ అహంభావాన్ని వీడి, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.


వార్తలు కూడా చదవండి...

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు..

నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Aug 13 , 2026 | 07:21 AM