Road Accident: డివైడర్‌ను ఢీకొన్న కారు.. టీడీపీ నేత మృతి
ABN , Publish Date - Jan 16 , 2026 | 01:33 PM
ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత జాకీర్ మృతిచెందారు. జాకీర్ మృతి పట్ల మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రకాశం, జనవరి 16: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) టీడీపీ నేత మృతిచెందారు. మేదరమెట్ల వద్ద ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నెల్లూరు టీడీపీ నాయకుడు, 42&43 క్లస్టర్ ఇంఛార్జ్ జాకీర్ (TDP leader Zakir) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని జాకీర్‌ను చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ జాకీర్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ప్రమాద వార్త తెలిసిన వెంటనే మంత్రి పొంగూరు నారాయణ ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును, వైద్యులు అందించిన చికిత్సను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాకీర్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. జాకీర్ మృతి పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ నేత భౌతికకాయాన్ని మంత్రి నారాయణ సందర్శించి నివాళులర్పించారు. జాకీర్ మృతిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలియజేశారు. కాగా.. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ఆ కుక్కకు ఏమైంది.. నాలుగు రోజులుగా దేవతల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు
వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
Read Latest AP News And Telugu News