Cyber Crime: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.23 కోట్లు స్వాహా
ABN , Publish Date - Jan 01 , 2026 | 03:20 PM
ప్రకాశం జిల్లాలో డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నుంచి కోట్లు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. నాగేశ్వరరావు అనే వ్యక్తి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేసి రిటైర్డ్ అయ్యారు.
ప్రకాశం, జనవరి 1: సైబర్ నేరగాళ్ల మోసాలకు అంతేలేకుండా పోతోంది. వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతూ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను కాజేస్తున్నారు. అందులో ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ ప్రజలను తీవ్రంగా వణికిస్తోంది. నేరాళ్లో చిక్కుకున్నారని, అరెస్ట్ చేయబోతున్నామని ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. వారి మాటలు నమ్మి కోట్లల్లో డబ్బులు పోగోట్టుకున్న వారు అనేక మంది ఉన్నారు. తాజాగా ఇదే మోసంతో ఓ రిటైర్ట్ బ్యాంక్ ఉద్యోగి నుంచి కోట్లు కొట్టేశారు కేటుగాళ్లు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒత్తిడి తీసుకురావడంతో సదరు రిటైర్డ్ ఉద్యోగి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళితే...
సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి నాగేశ్వరరావు కోటి 23 లక్షలు పోగొట్టుకున్నారు. నాగేశ్వరరావు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేసి రిటైర్డ్ అయ్యారు. ఈ క్రమంలో నగదు హవాలా చేశావంటూ నాగేశ్వరరావును కేటుగాళ్లు బెదిరించారు. వారం రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో నాగేశ్వరరావును ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయన నుంచి దాదాపు రూ.1.23 కోట్ల నగదును వసూలు చేశారు. సైబర్ నేరగాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక రిటైర్డ్ ఉద్యోగి మానసికంగా ఇబ్బంది పడ్డారు. చివరకు సైబర్ నేరగాళ్ల మోసం అద్దంకి పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
యువకుడిపై కుక్కర్‌తో మూకుమ్మడి దాడి.. ఎందుకంటే?
కేసీఆర్‌కు నచ్చితే ఎంత?.. నచ్చకుంటే ఎంత?: మంత్రి ఆనం
Read Latest AP News And Telugu News