Share News

దర్శి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:06 PM

ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ, వైసీపీ శ్రేణులు పోటాపోటీగా మోహరించగా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నామినేషన్ల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దర్శి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్
Darsi municipal nominations police lathi charge

Darsi municipal nominations police lathi charge: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులు.. వారి మద్దతుదారులతో ఒకే సమయంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

దర్శి మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు ఈరోజు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు. దీంతో వారి మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో దర్శి మున్సిపల్ కార్యాలయం ప్రాంగణానికి చేరుకుని పోటాపోటీగా మోహరించారు. ఇరువర్గాలు మున్సిపల్ ఆఫీస్ ఎదుట భారీగా గుమిగూడటంతో ప్రత్యర్థి వర్గాల మధ్య తోపులాట, ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి అక్కడి నుంచి చెదరగొట్టారు.

రాష్ట్రంలోని రాయచోటి, పుంగనూరు, ధర్మవరం వంటి ప్రాంతాల్లో నామినేషన్ల సందర్భంగా దాడులు, ఘర్షణలు జరిగిన నేపథ్యంలో దర్శి మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం అభ్యర్థులను మాత్రమే లోపలికి అనుమతిస్తూ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Oct 17 , 2026 | 05:02 PM