ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్వల్ప అస్వస్థత
ABN , Publish Date - Mar 25 , 2026 | 08:35 PM
నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. తమిళనాడులోని సీఎంసీ వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా న్యూరో సమస్యతో బాధపడుతున్న ఆయనకు గత నాలుగు రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన తమిళనాడులోని రాయ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నాలుగు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
కొంతకాలంగా న్యూరో సంబంధిత సమస్యతో బాధపడుతున్న కోటంరెడ్డి ఇటీవల కేరళలో ఆయుర్వేద చికిత్స కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే సమస్య పూర్తిగా తగ్గకపోవడంతో మళ్లీ చికిత్స కోసం సీఎంసీ ఆసుపత్రిని ఆశ్రయించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే పూర్తిగా కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశముందని, మరో వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.
Also Read:
గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్..
కష్టపడి పని చేసేవారికి అవకాశాలు పుష్కలం: నారా భువనేశ్వరి
For More Latest News