గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్..
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:44 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 2026 - 2027 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని నిర్ణయించింది.
అమరావతి, మార్చి 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 2026 - 2027 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి కీలక ప్రకటన చేసింది. 2026 - 2027 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదని తెలిపింది. 2026 - 2027 డిస్కమ్‌ల లోడ్ 15,790 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తానని ముందుకు రావడంతో వినియోగదారులకు బిగ్ రిలీఫ్ దక్కింది.
2024 - 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రూ అప్ ఛార్జీల విధింపు కూడా నిలిపివేసినట్లు ఏపీఈఆర్‌సీ తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని కోటి 13 లక్షల మంది గృహ వినియోగదారులకు టారిఫ్ పెంపు నుంచి మినహాయింపు దక్కనుంది. ప్రభుత్వం వాణిజ్య వినియోగదారులకు ఊరట నిచ్చేలా యూనిట్ ధరను 12.25 రూపాయల నుంచి 9. 95 రూపాయలకు తగ్గించింది. ఈ నిర్ణయం ద్వారా 2 లక్షల మంది వాణిజ్య వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. అంతేకాదు.. కుటీర పరిశ్రమలకు లోడ్ పరిమితిని 10 హెచ్‌పీ నుంచి 20 హెచ్‌పీకి పెంచింది. రాష్ట్రంలోని 18 వేల మంది కుటీర పరిశ్రమల వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.
ఇవి కూడా చదవండి
పీఎన్‌జీ తిరస్కరిస్తే ఎల్‌పీజీ సరఫరా కట్: కేంద్రం
పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. భయపడకండి: మంత్రి ఉత్తమ్