టీడీపీ అబద్ధాలు చెప్పదు... ప్రచారాలు చేసుకోదు: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - May 19 , 2026 | 12:31 PM
టీడీపీ అబద్ధాలు చెప్పదని... ప్రచారాలు చేసుకోదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు ఏమి కావాలో అదే చేస్తుందని స్పష్టం చేశారు.
నెల్లూరు, మే 19: టీడీపీ స్థాపించిన నాటి నుంచి పార్డీకి, ఎన్టీఆర్, చంద్రబాబుకి ఎన్నెన్నో కష్టాలు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మత్స్యకారులు కుటుంబ సభ్యుల్లా పార్టీతో ఉన్నారని తెలిపారు. టీడీపీ అబద్ధాలు చెప్పదని... ప్రచారాలు చేసుకోదన్నారు. ప్రజలకు ఏమి కావాలో అదే చేస్తుందని స్పష్టం చేశారు. 2014 - 2019 రాష్ట్రానికి, మత్స్యకారులకి స్వర్ణయుగమన్నారు. 2019 ఎన్నికల్లో ఓ దుర్మార్గుడి మాయ మాటలు నమ్మామని.. కులాల్లో చిచ్చుపెట్టారని అన్నారు. చిన్న ఏమర పాటుతో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని విమర్శించారు. ప్రపంచంలో ఏపీని అసహ్యించుకునేలా చేశారని మండిపడ్డారు.
చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక.. పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి తెలిపారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి ఎవరు చేశారో ఆలోచించాలన్నారు. వైసీపీ పేరు, ఆ నాయకుడి పేరు చెప్పనని... అవి చెబితే దరిద్రం చుట్టుకుంటుందంటూ వ్యాఖ్యానించారు. ఆ ఐదేళ్లలో ఏ సబ్సీడీలు ఇచ్చారో చెప్పాలని ఛాలెంజ్ విసిరారు. బీమా సొమ్ము, ఆయిల్ సబ్సీడీ డబ్బులు బకాయిలు పెట్టారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల మర బోట్ల ఆగడాలని పూర్తిగా అరికట్టామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల లైంగిక దాడి
ఆ నిధుల విడుదలపై మత్స్యకారుల హర్షం.. కృష్ణానదిలో బోట్లతో ర్యాలీ
Read Latest AP News And Telugu News