కారు, లారీ ప్రమాదం.. ఏబీఎన్ ఇన్‌పుట్ ఎడిటర్ కుటుంబానికి తప్పిన ప్రమాదం..
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:26 PM
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ఏబీఎన్ ఇన్‌పుట్ ఎడిటర్ శ్రీహరి రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది.
నెల్లూరు, మార్చి 7: చెన్నై-కలకత్తా జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. బాతుల లోడుతో వెళ్తున్న లారీ అతి వేగంగా వెనుక నుంచి కారును, మరో లారీని ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో కారులో ఏబీఎన్ ఇన్‌పుట్ ఎడిటర్ శ్రీహరి రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నారు. తమ సొంతూరు వాకాడు మండలంలోని మట్టెంబాకం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతి వేగంతో దూసుకొచ్చిన బాతుల లోడు లారీ ముందుగా కారును ఢీకొట్టి, ఆ తర్వాత మరో లారీని తాకింది.
ఆపై బాతుల లోడు లారీ డివైడర్‌పై బోల్తా పడింది. మరో లారీ డివైడర్ దాటి వెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారుకు ఇరువైపులా డ్యామేజ్ అయ్యింది. ఏబీఎన్ ఇన్‌పుట్ ఎడిటర్ శ్రీహరి రెడ్డి కుటుంబ సభ్యులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం వల్ల గంటపాటు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి...
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం.. పవన్ స్పందన ఇదే
‘మద్య నిషేధం’ హామీ వెనక నిజమైన స్టోరీ ఇదేనా.. జగన్‌కు లోకేశ్ సూటి ప్రశ్న
Read Latest AP News And Telugu News