Share News

పవన్‌ నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి!

ABN , Publish Date - Sep 03 , 2026 | 05:50 AM

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఉదయం ఆయనకు ఫోన్‌ చేసిన చంద్రబాబు.. ‘ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

 పవన్‌ నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి!

జనసేనానికి ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఉదయం ఆయనకు ఫోన్‌ చేసిన చంద్రబాబు.. ‘ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌లో... ‘పవర్‌ స్టార్‌గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే పవన్‌ కల్యాణ్‌ పంచాయతీరాజ్‌ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ధి కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకొనేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నా’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

దేవుడిచ్చిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు: లోకేశ్‌

మంత్రి లోకేశ్‌ ఎక్స్‌లో... ‘సినీ అభిమానులకు పవర్‌ స్టార్‌, జనసైనికులకు సేనాని, నాకు దేవుడిచ్చిన అన్నయ్య... పవనన్న ఆయురారోగ్య ఆనందాలతో వందేళ్లు వర్ధిల్లాలి. తెలుగు రాష్ట్రాల్లో పండుగను తలపించేలా పవనన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు అభినందనలు’ అని పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు: పవన్‌ కల్యాణ్‌

‘నా పుట్టిన రోజు సందర్భంగా నాకు ఫోన్‌ చేసి, సందేశాలు పంపి, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞుడిని. మీ ప్రేమాభిమానాలు నా బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించాలని ఎప్పుడూ గుర్తు చేస్తాయి’ అని పవన్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 05:50 AM