Share News

జనసేనకు ‘జై కొట్టు..’

ABN , Publish Date - Sep 03 , 2026 | 05:41 AM

యువత ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనలకు అనుగుణంగా జనసేన పార్టీ యువజన విభాగం పనిచేస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. జనసేన ప్రయాణంలో వారిదే కీలక పాత్ర అని, స్థానిక ఎన్నికల్లో యువత, మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ వంద శాతం స్ట్రయిక్‌ రేట్‌తో విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు.

జనసేనకు ‘జై కొట్టు..’

  • నూరు శాతం స్ట్రయిక్‌ రేట్‌తో విజయం సాధిద్దాం

  • యువత ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా

  • జనసేన యువజన విభాగం పనిచేయాలి

  • స్థానికంలోనూ యువత, మహిళలకు ప్రాధాన్యం

  • పార్టీ ప్రయాణంలో వారిదే కీలక పాత్ర: మనోహర్‌

  • యువజన విభాగానికి ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ

  • జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఆడియో సందేశం

పఠాపురం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): యువత ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనలకు అనుగుణంగా జనసేన పార్టీ యువజన విభాగం పనిచేస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. జనసేన ప్రయాణంలో వారిదే కీలక పాత్ర అని, స్థానిక ఎన్నికల్లో యువత, మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ వంద శాతం స్ట్రయిక్‌ రేట్‌తో విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను మనోహర్‌ ఆవిష్కరించారు. గీతాన్ని విడుదల చేశారు. జనసేన 12 ఏళ్ల ప్రస్థానంపై ఏవీలు ప్రదర్శించారు. కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమాన్ని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఎల్‌ఈడీ స్ర్కీన్లపై వీక్షించే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్‌ మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ ఆలోచన ఎల్లప్పుడూ యువత భవిష్యత్తు గురించే ఉంటుందని చెప్పారు. యువత ఆలోచనల నుంచే జనసేన పార్టీ ఆవిర్భవించిందని, ఇప్పుడు యువజన విభాగం ఏర్పాటైందన్నారు. యువజన విభాగం యువత ఆలోచనలు, ఆకాంక్షలకు వారధిగా నిలుస్తుందని తెలిపారు.


యువత రాజకీయాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. నియంతలాంటి జగన్‌కు ఎదురొడ్డి నిలబడి పోరాడటమే గాక, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో జనసేన పాల్గొందన్నారు. 2019 ఎన్నికల తర్వాత అప్పటి ప్రభుత్వాధినేత జనసేనపై సాగించిన దమనకాండ, దాడిని యువతే అడ్డుకుందని గుర్తుచేశారు. జనసేన క్రియాశీలక సభ్యులు 50 వేల నుంచి ఇప్పుడు 21.52 లక్షలకు చేరారని చెప్పారు. ‘‘ఇక నుంచి మన మాతృభూమికి జై కొడదాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపి కూటమి పాలనకు జై కొడదాం... పవన్‌ కల్యాణ్‌ ఆశయాలకు జై కొడదాం... జనసేనకు జై కొడదాం... భరతమాతకు జై కొడదాం..’’ అని మనోహర్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయశ్రీనివాస్‌, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


పవన్‌ ఆడియో సందేశం

కేరళం రాష్ట్రంలో చికిత్స చేయించుకుంటున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తన సందేశాన్ని ఆడియో రూపంలో అందించారు. ఆ సందేశం ఆయన మాటల్లోనే...

‘‘జై కొట్టు... దేహీ అని దేబిరించే చేతులు మాకొద్దు..

దేశం కోసం యుద్ధం చేసే పిడికిళ్లు కావాలి

నేనెక్కడున్నానో అనే ప్రశ్నార్థకపు చేతులు మాకొద్దు

నేనిక్కడ ఉంటాననే అస్థిత్వం పిడికిళ్లు కావాలి

ఇన్నాళ్లూ నాయకుల కోసం, పార్టీల కోసం, ఓట్ల కోసం జిందాబాద్‌లు కొట్టాం.. చాలు

ఇక యువత కోసం, వారి భవిత కోసం జై కొట్టు

పట్టు వదలని జనం కోసం.. పోరాడే జనసేన కోసం జై కొట్టు’’

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 05:41 AM