పొగాకు విక్రయాలకు కేంద్రం అనుమతులివ్వడం హర్షణీయం: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Sep 25 , 2026 | 06:54 PM
సిగరెట్ల తయారీలో ఉపయోగించే అనధికారిక పొగాకు విక్రయాలకు కేంద్రం అనుమతివ్వడాన్ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వాగతించారు. కేంద్ర నిర్ణయంతో పొగాకు రైతులకు భారీ ఉపశమనం కలుగుతుందన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 25: ఎఫ్‌సీవీ పొగాకు విక్రయాలకు కేంద్రం అనుమతివ్వడాన్ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వాగతించారు. కేంద్ర నిర్ణయంతో రైతులకు భారీ ఉపశమనం కలుగుతుందన్నారు. ఈ నిర్ణయం ద్వారా పండించిన పొగాకును విక్రయించడంలో రైతుకు వెసులుబాటు కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు.డు పేర్కొన్నారు.
దానితోపాటు అధీకృత వేలం కేంద్రాల్లో నమోదు కాని రైతులకు సైతం పొగాకు విక్రయించే అవకాశం కల్పించడం హర్షణీయమని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు పొగాకు రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర వాణిజ్య శాఖామంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ప్రయోజనాలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూడా ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు. పొగాకు రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని, వారికి అన్నీ రకాలుగా సహకరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
వినియోగదారులకు ఊరట కలిగించేలా ధరలు: మంత్రి అచ్చెన్నాయుడు
ధరల విషయంలో రైతులకు భరోసా కల్పించే విధంగా.. వినియోగదారులకు ఊరట కలిగించే విధంగా తగినచర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 35 రూపాయలకే కిలో ఉల్లిపాయలు, 50 రూపాయలకే కిలో సన్నబియ్యం రైతుబజార్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కిలో గోధుమపిండి(చక్కీ) 27 రూపాయలకే సరఫరా చేస్తామన్నారు. 8.81 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. అందుకోసం రూ.2 కోట్లకుపైగా ఆర్థిక సహాయం అవసరమవుతుందన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన అనంతరం సమగ్ర కార్యాచరణను తెలియజేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
మానవతా సేవలో AAA ముందడుగు.. పెన్సిల్వేనియాలో రక్తదాన శిబిరం..
ఆస్టిన్ పాఠశాల.. అద్భుతమైన పునఃప్రారంభం