Share News

మానవతా సేవలో AAA ముందడుగు.. పెన్సిల్వేనియాలో రక్తదాన శిబిరం..

ABN , Publish Date - Sep 24 , 2026 | 08:00 AM

ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ పెన్సిల్వేనియా అండ్ డెలావేర్ విభాగం అమెరికన్ రెడ్ క్రాస్ సహకారంతో డౌనింగ్‌టౌన్, పెన్సిల్వేనియాలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వ్యవస్థాపకులు హరి మోటుపల్లి ఈ శిబిరానికి సహకారం అందించారు.

మానవతా సేవలో AAA ముందడుగు.. పెన్సిల్వేనియాలో రక్తదాన శిబిరం..
AAA Blood Donation Drive

పెన్సిల్వేనియా/డెలావేర్: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) పెన్సిల్వేనియా అండ్ డెలావేర్ విభాగం అమెరికన్ రెడ్ క్రాస్ సహకారంతో డౌనింగ్‌టౌన్, పెన్సిల్వేనియాలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వ్యవస్థాపకులు హరి మోటుపల్లి సహకారం అందించారు. పెన్సిల్వేనియా అండ్ డెలావేర్ విభాగం కొత్త నాయకత్వ బృందం హారిక పెద్దిరెడ్డి, హేమంత్ దొమ్మరాజు, తేజో ప్రకాశ్ రెడ్డివారి, దివ్య కీర్తి మలినేని ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

AAA2.jpg


ఈ కార్యక్రమానికి ప్రవాసుల నుంచి విశేష స్పందన లభించింది. ఎంతోమంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి, ఈ గొప్ప సేవా కార్యక్రమానికి మద్దతు అందించారు. దీనిని విజయవంతం చేయడంలో సహకరించిన దాతలు, వాలంటీర్లు, సమన్వయకర్తలు అందరికీ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ నాయకత్వ బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. 'మనమంతా కలిసి ప్రాణాలను కాపాడుదాం.. సమాజంలో మార్పు తీసుకువద్దాం. ఐక్యత, సేవాభావం, సమాజ శ్రేయస్సే మా లక్ష్యం' అని ఈ సంస్థ పెన్సిల్వేనియా అండ్ డెలావేర్ విభాగం నాయకత్వ సభ్యులు పేర్కొన్నారు.

AAA3.jpg


ఈ వార్తలు కూడా చదవండి

డా. ఉమా ఆర్. కటికి ఆధ్వర్యంలో 'ఇమ్మిగ్రేషన్ 360°' అవగాహన సదస్సు గ్రాండ్ సక్సెస్

ఫ్రాంక్‌ఫర్ట్‌లో అంగరంగ వైభవంగా ‘తెలుగు సంబరం 2026’

Updated Date - Sep 24 , 2026 | 08:05 AM