Share News

కస్టమర్ లాగా వచ్చి ఫోన్ దొంగతనం.. ఆపై రూ.లక్ష ట్రాన్స్‌ఫర్

ABN , Publish Date - Sep 16 , 2026 | 05:00 PM

చెప్పుల కొనుగోలుకు వచ్చి యజమానిని మాటల్లో పెట్టి ఫోన్ కొట్టేసిన యువకుడు.. ఆపై అదే ఫోన్ నుంచి లక్ష రూపాయలు బదిలీ చేసుకున్నాడు. తేరుకున్న యజమాని లబోదిబోమంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఎన్‌టీఆర్ జిల్లాలోని తిరువూర్‌లో జరిగింది.

కస్టమర్ లాగా వచ్చి ఫోన్ దొంగతనం.. ఆపై రూ.లక్ష ట్రాన్స్‌ఫర్
mobile theft in ntr district

ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ 16: చెప్పుల కొనుగోలుకు వచ్చి యజమానిని మాటల్లో పెట్టి ఫోన్ కొట్టేసిన యువకుడు.. ఆపై అదే ఫోన్ నుంచి లక్ష రూపాయలు బదిలీ చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని తిరువూర్‌లో జరిగింది.


బాధితుడి కథనం ప్రకారం.. జిల్లాలోని తిరువూర్ రోడ్డులో గుర్రం జగన్మోహన్ రావు చెప్పుల షాపు నిర్వహిస్తారు. ఓ యువకుడు చెప్పుల కొనుగోలు చేయడానికి కస్టమర్ ‌లాగా షాప్‌లోకి వచ్చాడు. కాసేపు చెప్పులన్నీ చూసి.. ఓ సారి ఫోన్ కావాలని.. అర్జెంటుగా ఓ కాల్ చేసుకోవాలని యజమానిని కోరాడు. దీంతో జగన్మోహన్ తన ఫోన్‌ను ఆ యువకుడికి ఇచ్చారు. ఆ యువకుడు ఫోన్ చూస్తుండగా.. జగన్మోహన్ చెప్పులు తేవడానికి షాప్‌లోనికి వెళ్లాడు. వెంటనే ఆ యువకుడు ఫోన్ పట్టుకుని పారిపోయాడు. మరో వ్యక్తి బైక్ మీద వచ్చి ఆ యువకుడిని అక్కడినుంచి తప్పించాడు.


నిర్ఘాంతపోయిన జగన్మోహన్ రావు అసలు విషయం తెలుసుకుని.. బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోగా.. తన అకౌంట్ నుంచి లక్ష రూపాయలు వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు. దీంతో.. జగన్మోహన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఆ నిందితుడు హెల్మెట్ పెట్టుకుని వచ్చినట్లు జగన్మోహన్ పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెప్పుల షాప్‌లో అమర్చిన సీసీ టీవీ ఫుటేటీలను పోలీసులు పరిశీలించారు. ఈ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంపు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు

మహాత్మాగాంధీ మునిమనవడు కిదార్ రామ్ గోబిన్‌తో అయ్యన్నపాత్రుడు భేటీ

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Sep 16 , 2026 | 06:45 PM