Share News

తిరుమల నడకమార్గంలో చిరుత కలకలం

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:11 AM

అలిపిరి కాలినడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం కలకలం సృష్టించింది. అలిపిరి నుంచి తిరుమలకు చేరుకునే మార్గంలోని ఏడోమైలు వద్ద బుధవారం పట్టపగలే ఓ చిరుత జన సంచారం సమీపానికి వచ్చింది.

తిరుమల నడకమార్గంలో చిరుత కలకలం

తిరుమల, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): అలిపిరి కాలినడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం కలకలం సృష్టించింది. అలిపిరి నుంచి తిరుమలకు చేరుకునే మార్గంలోని ఏడోమైలు వద్ద బుధవారం పట్టపగలే ఓ చిరుత జన సంచారం సమీపానికి వచ్చింది. అది కొద్ది సమయం పాటు అక్కడే ఉండటంతో భక్తులు హడలిపోయారు. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్‌, ఫారెస్ట్‌ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకునే లోపే చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో రాత్రి పూట భక్తులను గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది సంరక్షణలో భక్తులు గుంపులుగా తిరుమలకు చేరుకునేలా చర్యలు చేపట్టారు. మూడు రోజుల క్రితం కూడా ఏడో మైలు సమీపంలోని నరసింహస్వామి ఆలయం వద్ద భక్తులకు చిరుత కనపడింది.

ఈ వార్తలనూ చదవండి:

రెన్యువల్‌ అయ్యేలా చర్యలు చేపట్టండి

స్థానిక పోరుకు సన్నద్ధం..!

Updated Date - Sep 10 , 2026 | 05:13 AM