Share News

రెన్యువల్‌ అయ్యేలా చర్యలు చేపట్టండి

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:38 PM

అన్ని మద్యం దుకాణాలు రెన్యువల్‌ అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్రీదేవి అన్నారు.

    రెన్యువల్‌ అయ్యేలా చర్యలు చేపట్టండి
సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటి కమిషనర్‌

నకిలీ మద్యం, పాత నేరస్థులపై నిఘా అవసరం

ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్రీదేవి

కర్నూలు అర్బన్‌ , సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): అన్ని మద్యం దుకాణాలు రెన్యువల్‌ అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్రీదేవి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల సూపరింటెండెంట్లు సుధీర్‌ బాబు, రవి కుమార్‌, సీఐలతో అసిస్టెంట్‌ కమిషనర్‌ వి. హనుమంతరావుతో కలిసి సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ మద్యం దుకాణాలకు ఈనెల చివరికి గడువు ముగియనుండటంతో రెన్యువల్‌ కోసం జీవో జారీ అయ్యే అవకాశం ఉందన్నారు. లైసెన్సీ దారులందరికీ సమావేశాలు ఏర్పాటు చేసి తెలియ జేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటికే కర్నూలు, నంద్యాల జిల్లాలను సారా రహిత జిల్లాలుగా ప్రకటించామన్నారు. తిరిగి సారా తయారీ చేయకుండా పాత నేరస్థులపై నిఘా ఉంచాలని, వారిని ఆయా తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేయాలని ఆదేశించారు. పొరుగురాష్ట్రాల నుంచి నకిలీ మద్యం జిల్లాలో ప్రవేశించకుండా నిఘాఉంచి చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 12న నిర్వహిం చే లోక్‌ అదాలతను సద్వినియోగించుకునేలా కాంపౌండబుల్‌ కేసుల్లో నమోదైన నిందితులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. అసిస్టెంట్‌ సూపరింటెండెంట్లు రాజశేఖర్‌ గౌడ్‌ , రామకృష్ణారెడ్డి విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 11:38 PM