కర్నూలు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నా : మంత్రి టీజీ భరత్
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:30 PM
ఈరోజు (ఆదివారం) కర్నూలులోని సెయింట్ జోసెఫ్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు.
కర్నూలు, నవంబర్ 22: కర్నూలు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఇక్కడి పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఈరోజు (ఆదివారం) కర్నూలులోని సెయింట్ జోసెఫ్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఏకమైతేనే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. కర్నూలులో 11 ఏళ్లుగా వనభోజనాల మహోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యులకు అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు దొరికిందని పేర్కొన్నారు.
అనంతరం కర్నూలులో తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి టీజీ భరత్ వివరించారు. ఓర్వకల్లు ప్రాంతానికి సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. రిలయన్స్ వంటి సంస్థల రాకతో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు. అలాగే సమాజానికి మంచి చేసే వారికి ప్రజలు అండగా నిలవాలని ఆయన సూచించారు.
ఈ వార్తలూ చదవండి
ధరణి కృష్ణ జాబ్ ఫ్రాడ్ కేసు.. హైదరాబాద్‌లో సీఐడీ సోదాలు
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!