Share News

ధరణి కృష్ణ జాబ్ ఫ్రాడ్ కేసు.. హైదరాబాద్‌లో సీఐడీ సోదాలు

ABN , Publish Date - Nov 22 , 2026 | 06:47 PM

ధరణి కృష్ణ జాబ్ ఫ్రాడ్స్ కేసులో సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ న్యాయవాది కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.

ధరణి కృష్ణ జాబ్ ఫ్రాడ్ కేసు.. హైదరాబాద్‌లో సీఐడీ సోదాలు
Job Fraud Case

ఇంటర్నెట్ డెస్క్: ధరణి కృష్ణ జాబ్ ఫ్రాడ్స్ కేసులో సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. జనసేన నేతల పేర్లు చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ధరణి కృష్ణ అనే మహిళపై ఆరోపణలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దేవాదాయ, పోలీస్ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆమె మోసానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ధరణి కృష్ణ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్టు సమాచారం రావడంతో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కూకట్‌పల్లిలోని ఓ న్యాయవాది కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నకిలీ గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు గుర్తించారు. కాగా బోడపాటి ధరణి కృష్ణ, నిమ్మకాయల పెద్దిరాజు తదితరులపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. వీరు ఒకో బాధితుడి వద్ద రూ.15 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.


కాగా కేసులో ఏ2గా ఉన్న నిమ్మకాయల పెద్దిరాజును సీఐడీ అధికారులు నవంబర్ 18న అరెస్టు చేశారు. పెద్దిరాజును గత గురువారం సాయంత్రం గుంటూరులోని సీఐడీ కోర్టులో హజరుపరిచారు. మెజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించడంతో అతడిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. పెద్దిరాజును హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ అదనపు డీఎస్పీ బి.సీతారామయ్య గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


ఈ వార్తలూ చదవండి

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రూ.30 వేల కోట్లు అవసరం.. రేవంత్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Nov 22 , 2026 | 06:53 PM