తేనెటీగల దాడి.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి..
ABN , Publish Date - Mar 25 , 2026 | 01:45 PM
శ్రీశైలం డ్యామ్ వద్ద తీవ్ర విషాదం నెలకొంది. తేనెటీగల దాడిలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. పిల్లి వీరస్వామి(52) అనే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ డ్యామ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు.
నంద్యాల: శ్రీశైలం డ్యామ్(Srisailam Dam) వద్ద తీవ్ర విషాదం నెలకొంది. తేనెటీగల దాడి(Bee Attack)లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. పిల్లి వీరస్వామి(52) అనే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(Special Protection Force) కానిస్టేబుల్.. శ్రీశైలం డ్యామ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో ఉండగా వీరస్వామిపై తేనెటీగలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. విపరీతంగా కుడుతుండడంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు కానిస్టేబుల్. దాడి నుంచి తప్పించుకునే క్రమంలో పరుగులు తీశారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతిచెందారు. కానిస్టేబుల్ మృతి బాధిత కుటుంబం, డిపార్ట్‌మెంట్‌లో తీరని శోకాన్ని మిగిల్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల కలకలం
ఐకానిక్ టవర్ల నిర్మాణం పనులు వేగవంతం: మంత్రి నారాయణ