Minister TG Bharath: కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయం: మంత్రి భరత్
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:32 PM
పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమలపై చిల్లర చేష్టలు ఇకనైనా ఆపాలంటూ వైసీపీ నేతలకు మంత్రి టీజీ భరత్ హితవు పలికారు. తమ ప్రభుత్వంపై బురదజల్లేందుకు వైసీపీ ఆడిన మద్యం బాటిల్స్ నాటకం బయట పడిందని మండిపడ్డారు.
కర్నూలు, జనవరి 11: కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయమని ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో కలిసి చర్చిస్తున్నామన్నారు. ఈ హైకోర్టు బెంచ్‌ను ఏ, బీ, సీ క్యాంపుల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. హైకోర్టు బెంచ్‌తోపాటు కలెక్టరేట్ భవనం కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆదివారం కర్నూలులో అడ్వకేట్లు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమలపై చిల్లర చేష్టలు ఇకనైనా ఆపాలంటూ వైసీపీ నేతలకు మంత్రి టీజీ భరత్ హితవు పలికారు. తమ ప్రభుత్వంపై బురదజల్లేందుకు వైసీపీ ఆడిన మద్యం బాటిల్స్ నాటకం బయటపడిందని మండిపడ్డారు. టెక్నాలజీ వినియోగించి.. ఈ బండారం బయటపెట్టామని మంత్రి వివరించారు. ఇలా దొరికిపోతామని వైసీపీ నేతలు ఊహించి ఉండరన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు వచ్చినా వైసీపీ నేతలు మారడం లేదంటూ మంత్రి టీజీ భరత్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు దగ్గర అవ్వాలనే ఆలోచన వారికి లేదన్నారు. ఇలాంటి తప్పుడు పనులను తమ ప్రభుత్వం ఏ మాత్రం సహించబోదని కుండబద్దలు కొట్టారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు తమ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ యలమంచి బాలాజీ, ప్రభుత్వ న్యాయవాదులు(పీపీలు), న్యాయవాదులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ కూరగాయలు తింటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా చెక్ పెట్టొచ్చు..
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More AP News And Telugu News