Share News

Vegetables: ఈ కూరగాయలు తింటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా చెక్ పెట్టొచ్చు..

ABN , Publish Date - Jan 11 , 2026 | 01:52 PM

ఆరోగ్యానికి కూరగాయలు చాలా అవసరం. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి..

Vegetables: ఈ కూరగాయలు తింటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా చెక్ పెట్టొచ్చు..
Healthy Vegetables Benefits

ఒకప్పుడు చక్కటి ఆహారం తీసుకుంటూ మనుషులు ఎంతోకాలం జీవించేవారు. ప్రస్తుత జీవనశైలిలో మనం తినే ఆహారం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మనం తినే ఆహారంలో కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయి. మీ డైట్‌లో ఈ కూరగాయలను చేర్చుకుంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.


1. పాలకూర: ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. పప్పు, కూర, సలాడ్, కిచిడీ వంటి వంటకాల్లో వాడతారు. పాలకూర విటమిన్ ఎ, సి, కె, ఫోలేట్ వంటి వాటితో నిండి ఉంటుంది. కిడ్నీలో రాళ్లు, యూరిక్ యాసిడ్ ఉన్నవారు దీన్ని తినకూడదు.

2. తోటకూర: ఈ ఆకులో విటమిన్ ఎ, కె, బి6, సి, రొబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్ మరెన్నో రకాల పోషకాలు ఉన్నాయి. రక్తహీనత, జీర్ణక్రియ మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి, ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది.

3. క్యాబేజీ: ఇవి ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగులో ఉంటాయి. విటమిన్ సి, కె, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంచి, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. గుండె జబ్బు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4.కాలీఫ్లవర్: ఇందులో విటమిన్ సి, కె, ఫోలెట్, ఫైబర్ వంటివి ఉంటాయి. జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.

5. బీట్ రూట్: ఇది ఇక ఆరోగ్యకరమైన దుంప కూరగాయ, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. రక్తపోటు, రక్తహీనత నివారించడం, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.


6. క్యారెట్: ఇందులో బీటా - కెరోటిన్, నైట్రేట్స్ ఉంటాయి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.

7. వెల్లుల్లి: వీటిని నేచురల్ యాంటీ బయటిక్స్ అని పిలుస్తారు. ఉపిరితిత్తులు రుగ్మతలను తగ్గిస్తుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. వెల్లుల్లి ఇన్సూలిన్‌ను పెంచుతుంది. రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

8. ఉల్లిపాయ: ఇందులో సి, బి6, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. గుండె జబ్బుల ప్రమదాన్ని తగ్గిస్తాయి, కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి.

9. బెండకాయ: ఇది ఎన్నో రకాల పోషక విలువలు కలిగిన కూరగాయ. ఎ, బి, సి, మెగ్నీషియం, ఫోలెట్, ఫైబర్ వంటి విటమిన్లు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉన్నాయి. మధుమేహం, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.


(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)

Also Read:

తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?

Updated Date - Jan 11 , 2026 | 02:47 PM