Share News

వినాయక నిమజ్జనానికి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు: మంత్రి టీజీ భరత్

ABN , Publish Date - Sep 13 , 2026 | 08:08 PM

రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా కర్నూలులో వినాయక నిమజ్జనం జరగనుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. అందుకు తగినట్లు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

వినాయక నిమజ్జనానికి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు: మంత్రి టీజీ భరత్
AP Minister TG Bharath

కర్నూలు, సెప్టెంబర్13: రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా కర్నూలులో వినాయక నిమజ్జనం జరగనుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. అందుకు తగినట్లు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆదివారం కర్నూలులోని కేసీ కాలువ, నన్నూర్ టోల్ ప్లాజా వద్ద నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి భరత్ మాట్లాడుతూ.. హంద్రీనీవాలో ప్రస్తుతం నీటి ప్రవాహం బాగుందని తెలిపారు. నిమజ్జనం సమయంలోనూ నిరంతర నీటి ప్రవాహం ఉండే అవకాశం ఉందని చెప్పారు.


కేసీ కెనాల్ కాలువలో రెండు వైపులా గోడలు నిర్మించి ట్యాంక్‌ తరహాలో నీటిని నిల్వ చేస్తామని వివరించారు. సుంకేసుల బ్యారేజీలో గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యల్పంగా 0.288 టీఎంసీ నీటి నిల్వ మాత్రమే ఉందని అన్నారు. అందుకే సుంకేసుల బ్యారేజీ నుంచి నేరుగా కేసీ కెనాల్‌కు నిమజ్జనానికి నీటిని విడుదల చేసే పరిస్థితి ఈసారి లేదని పేర్కొన్నారు. పంప్ హౌస్ నుంచి ప్రతి రోజు వృధాగా పోతున్న 20 లక్షల లీటర్ల నీటిని కేసీ కెనాల్‌కు తరలించి వినాయక ఘాట్ వద్ద ఏర్పాటు చేసే ట్యాంక్‌లో నిల్వ చేస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు: కొండా సురేఖ

కోకాపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థి స్పాట్ డెడ్

For More AP News And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 08:15 PM