Share News

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. వైసీపీ దుష్ట రాజకీయాలు: మంత్రి జనార్దన్ రెడ్డి

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:54 PM

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతుందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అలజడలు సృష్టించి, శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. వైసీపీ దుష్ట రాజకీయాలు: మంత్రి జనార్దన్ రెడ్డి
AP Minister BC Janardhan Reddy

నంద్యాల, జూన్01: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతుందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అలజడలు సృష్టించి, శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల ఉచ్చులో పడకుండా మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూటమిలోని పార్టీ నేతలతోపాటు కార్యకర్తలకు ఆయన స్పష్టం చేశారు.


సోమవారం ఉమ్మడి కర్నూలు జిల్లా సంజామల మండలం ముదిగేడులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహంపై దాడి చేసింది.. వైసీపీ కార్యకర్త జంబులయ్య అని వివరించారు. తాము వైసీపీ మద్దతుదారులమంటూ జంబులయ్య భార్య బాలమ్మ వీడియో రిలీజ్ చేసిందని తెలిపారు. తమకు స్థానిక వైసీపీ కార్పొరేటర్ శేషయ్య ఉద్యోగం ఇప్పించారని కూడా ఆమె చెప్పిందని పేర్కొన్నారు.


వాస్తవాలు ఇలా ఉంటే ఈ కుట్రలో తెలుగుదేశం పార్టీని ఇరికించే ప్రయత్నం వైసీపీ చేసిందని ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.1995లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపారని గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉన్న పల్లెలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన గొడ్డలి పార్టీ నాయకుడు, నేతలకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.. '

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాపై ఆరోపణలు.. ఖండించిన ప్రభుత్వం
తిరుమలలో రికార్డు సృష్టించిన భక్తులు

For More AP News And Telugu News

Updated Date - Jun 01 , 2026 | 06:04 PM