నంద్యాల బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన
ABN , Publish Date - May 25 , 2026 | 04:46 PM
నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బనగానపల్లెలో మైనార్టీల కోసం నూతనంగా నిర్మిస్తున్న షాదీ ఖానా నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అతి త్వరలో షాదీ ఖానాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
నంద్యాల, మే 25: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బనగానపల్లెలో మైనార్టీల కోసం నూతనంగా నిర్మిస్తున్న షాదీ ఖానా నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అతి త్వరలో షాదీ ఖానాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అవుకుమెట్ట ప్రాంతంలో రహదారి విస్తరణ పనులను పరిశీలించి.. వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బనగానపల్లె పట్టణంలోని పాత ఎమ్మార్వో(ప్రస్తుత ఆర్టీవో) కార్యాలయం పునరుద్ధరణ పనులను పరిశీలించి.. అధికారులకు సలహాలు, సూచనలు చేశారు.
బనగానపల్లెలోని కొండపేట శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణ పనులను మంత్రి పర్యవేక్షించారు. అలాగే బనగానపల్లె బైపాస్ నిర్మాణ పనులను పరిశీలించారు. 2026 డిసెంబర్ నాటికి బనగానపల్లె ప్రజలకు బైపాస్‌ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి బీసీ జనార్దన్ ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
తిరుపతి వెటర్నరీ వర్సిటీలో చిరుత సంచారంపై డిప్యూటీ సీఎం ఆరా
విజయవాడలో ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమ్మిట్-2026 ప్రారంభం
Read Latest AP News And Telugu News