విజయవాడలో ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమ్మిట్-2026 ప్రారంభం
ABN , Publish Date - May 25 , 2026 | 12:28 PM
విజయవాడలోని ‘వన్ ఫ్యామిలీ - వన్ ఆంత్రప్రెన్యూర్ ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న అంబేద్కర్ కళావేదికను సీఎం ప్రారంభించారు.
అమరావతి, మే 25: విజయవాడలోని ‘వన్ ఫ్యామిలీ - వన్ ఆంత్రప్రెన్యూర్ ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 38 ఎంఎస్‌ఎంఈ పార్కులకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన చేశారు. మెటా, అమెజాన్, జోహో తదితర ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 1,500 మందికి పైగా ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక నిపుణులు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మొదటి, రెండో దశల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురం నగరాల్లో గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ‘రూట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఎక్స్‌టెన్షన్’ కేంద్రాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ.200 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 45 పారిశ్రామిక క్లస్టర్లలో ఉమ్మడి సౌకర్యాల కేంద్రాల ఏర్పాటుకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
ఆయిల్ కంపెనీల తీరుపై పెట్రోల్ బంక్ యజమానుల ఆగ్రహం
తిరుపతి వెటర్నరీ వర్సిటీలో చిరుత సంచారంపై డిప్యూటీ సీఎం ఆరా
Read Latest AP News And Telugu News