Share News

కర్నూలులో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత

ABN , Publish Date - Oct 11 , 2026 | 04:38 AM

నైరుతి రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శనివారం ఎండ తీవ్రత కొనసాగింది. కొన్నిచోట్ల పడమర గాలులు వీయడంతో వేడి వాతావరణం నెలకొంది.

కర్నూలులో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత

13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శనివారం ఎండ తీవ్రత కొనసాగింది. కొన్నిచోట్ల పడమర గాలులు వీయడంతో వేడి వాతావరణం నెలకొంది. రాయలసీమలో ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలులో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, శివారు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని, అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా థాయ్‌లాండ్‌ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారం నాటికి మలక్కా జల సంధి పరిసరాల్లోకి ప్రవేశించింది. ఇది ఆదివారం నాటికి అండమాన్‌ సముద్రంలోకి రానుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం

జయహో బీసీ

దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!

Updated Date - Oct 11 , 2026 | 04:38 AM