Share News

వీసా స్కాం కేసులో పోలీసు విచారణకు రమానందన

ABN , Publish Date - Sep 08 , 2026 | 01:42 PM

వీసా చీటింగ్ కేసులో యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చారు.

వీసా స్కాం కేసులో పోలీసు విచారణకు రమానందన
Rama Nandana

ఎన్టీఆర్‌ జిల్లా, సెప్టెంబర్ 8: వీసా చీటింగ్ కేసులో యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చారు. విదేశాల్లో వీసా ఉద్యోగం ఇప్పిస్తానని రమానందన దంపతులు రూ.13 లక్షలు వసూలు చేసినట్టు క్రాంతి కుమార్ అనే వ్యక్తి వచ్చిన ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిన్న(సోమవారం) యూకే నుంచి హైదరాబాద్ చేరుకున్న యూట్యూబర్‌కు విచారణ నిమిత్తం ఇవాళ రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా రామనందన పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.


అద్దంకిలో మరో కేసు

మరోవైపు వీసా స్కాం కేసులో రమానందనపై అద్దంకి స్టేషన్‌లో మరో కేసు నమోదు అయ్యింది. వీసా రెన్యువల్ కోసం సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ చేస్తామని డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో డబ్బులు వసూలు చేశారంటూ నందనపై ఆరోపణలు ఉన్నాయి. ఆగస్టులోనే యూట్యూబర్‌పై అద్దంకి పోలీసులు కేసు నమోదు చేశారు. 2023లో నందన డబ్బులు తీసుకొని తమను మోసం చేసిందంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తనపై వరుసగా పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదు కావడంతో బాధితులను ఇబ్రహీంపట్నం స్టేషన్‌కు రావాలని యూట్యూబర్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్, అద్దంకి నుంచి బాధితులు.. ఇబ్రహీంపట్నం పీఎస్‌కు చేరుకుంటున్నారు. రమానందనపై ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లోనే మొదట కేసు నమోదు కావడంతో అద్దంకి నుంచి ఇబ్రహీంపట్నానికి బాధితులు బయలుదేరారు.


ఇవి కూడా చదవండి...

డ్యూటీలో ఉన్న పోలీసులను కొట్టిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి: మంత్రి సీతక్క

స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు: హరీశ్ రావు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 01:51 PM