Share News

Reddigudem Case: కోడలి హత్య.. అత్తగారితోపాటు మరో మహిళ అరెస్ట్..

ABN , Publish Date - Jan 07 , 2026 | 08:58 PM

ఎన్టీఆర్ జిల్లాలోని రెడ్డిగూడెం హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ప్రధాన ముద్దాయి మృతురాలి అత్తగారేనని పోలీసులు తేల్చారు.

Reddigudem Case: కోడలి హత్య.. అత్తగారితోపాటు మరో మహిళ అరెస్ట్..

విజయవాడ, జనవరి 07: రెడ్డిగూడెం వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కోడలిని స్వయంగా అత్తగారే హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. బుధవారం మైలవరం తన కార్యాయలంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ దాడి చంద్రశేఖర్ వెల్లడించారు. దాంతో ఈ కేసులో మృతిరాలి అత్తగారితోపాటు మరో మహిళను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం వారిని కోర్టులో హజరుపరచగా.. వారికి రిమాండ్ విధించిందని వెల్లడించారు. ఆ తర్వాత వారిని జైలుకు తరలించామన్నారు.


రెడ్డిగూడెంకు చెందిన పద్మావతి.. తన కుమారుడికి ఎస్ శ్రావణిని ఇచ్చి వివాహం జరిపించింది. వివాహం అయిన నాటి నుంచి తన భర్త మాటను శ్రావణి వినేది కాదు. ఇష్టమొచ్చిన రీతిగా ఆమె ప్రవర్తించేది. పద్దతి మార్చుకోవాలని.. మూడు ముళ్లు వేసిన భర్తతో అన్యోన్యం ఉండాలంటూ శ్రావణికి పలుమార్లు పద్మావతి హితవు పలికింది. అత్త మాటలను ఆమె ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా తన ఇష్ట రీతిగా వ్యవహరించేది. ఈ నేపథ్యంలో కోడలిని హత్య చేయించేందుకు పద్మావతి పథక రచన చేసింది.


అందుకోసం తనకు తెలిసిన మహిళ కోటమ్మను వినియోగించింది. తన కోడలు శ్రావణిని హత్య చేసేందుకు కోటమ్మతో కలిసి రూ. 50 వేలు కాంట్రాక్ట్ పద్మావతి కుదుర్చుకొంది. ఆ క్రమంలో కోటమ్మతో కలిసి.. తన కోడలు శ్రావణిని ఇనుప రాడ్డుతో బలంగా కొట్టి హత్య చేసింది. అనంతరం తన కోడలిని ఎవరో హత్య చేశారంటూ పద్మావతి పోలీసులను ఆశ్రయించింది.


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందుకోసం పద్మావతి నివాసం పరిసర ప్రాంతాల్లోని స్థానికులను పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా పద్మావతి ఇంట్లోని వ్యవహారాన్ని పోలీసులకు స్థానికులు తెలిపారు. దీంతో పద్మావతిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. తమదైన శైలిలో విచారించారు. దాంతో శ్రావణిని తానే హత్య చేశానంటూ పద్మావతి నిజం ఒప్పుకుంది. ఈ హత్యకు కోటమ్మ అనే మహిళ తనకు సహాయపడిందని వెల్లడించింది. దాంతో వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జైలుకు తరలించారు. ఈ సమావేశంలో రెడ్డిగూడెం ఎస్సై శ్రీను పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: లోకేశ్

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష

For More AP News And Telugu News

Updated Date - Jan 07 , 2026 | 09:11 PM