Share News

దారుణం.. విధి నిర్వహణలో కానిస్టేబుల్ నిర్వాకం..

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:12 AM

విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నిర్వాకంతో సోదరులు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఒకరు మరణించగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దారుణం.. విధి నిర్వహణలో కానిస్టేబుల్ నిర్వాకం..

విజయవాడ, మార్చి 15: విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నిర్వాకంతో సోదరులు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఒకరు మరణించగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం జాతీయ రహదారిపై ఆర్టీవో చెక్ పోస్ట్ సమీపంలో ఆదివారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కేసరపల్లి నుంచి పెద్దఅవుటుపల్లికి సోదరులు ప్రణయ్ (21), కౌశిక్ (16) వెళ్తున్నారు. చెక్ పోస్ట్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులను చూసి వాహనాన్ని వెనక్కి మళ్లించేందుకు వారు ప్రయత్నించారు. ఆ సమీపంలోనే అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి.. స్కూటీని బలంగా తన్నాడు.


అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనాన్ని స్కూటీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో సోదరులిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో పోలీసులు వారిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అన్నయ్య ప్రణయ్ మరణించాడు. తమ్ముడు కౌశిక్ పరిస్థితి సైతం విషయంగానే ఉన్నట్లు సమాచారం. స్కూటీని తన్నిన పోలీస్ కానిస్టేబుల్ సీసీ ఫుటేజ్‌.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. రంగంలోకి పోలీసులు

దారుణం.. నిద్రలో నుంచి మరణంలోకి..

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 15 , 2026 | 11:54 AM