Share News

మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకు వక్ఫ్ బోర్డు భరోసా: మంత్రి ఫరూక్

ABN , Publish Date - Jun 14 , 2026 | 06:51 PM

మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకు వక్ఫ్ బోర్డు భరోసా ఇస్తుందని ఆ శాఖ సంక్షేమ, న్యాయ, వక్ఫ్, ఉర్దూ అకాడమి శాఖల మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ స్పష్టం చేశారు.

మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకు వక్ఫ్ బోర్డు భరోసా: మంత్రి ఫరూక్
AP Minister NMD Farooq

విజయవాడ, జూన్14: మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకు వక్ఫ్ బోర్డు భరోసా ఇస్తుందని ఆ శాఖ సంక్షేమ, న్యాయ, వక్ఫ్, ఉర్దూ అకాడమి శాఖల మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమం, వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలిమ్- ఏ - హునర్ టాలెంట్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన 250 మంది విద్యార్థులకు కాలేజ్ అలాట్‌మెంట్ సర్టిఫికెట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ.. మైనార్టీ విద్యార్ధులకు రూ. 6 కోట్లతో అత్యుత్తమ రెసిడెన్షియల్ విద్య అందిస్తున్నట్లు తెలిపారు.


250 మంది విద్యార్ధులకు ప్రముఖ విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందారని మంత్రి ఫరూక్ చెప్పారు. బాలికల ఎంపిక 41 శాతానికి చేరడం శుభపరిణామం అని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనాలో ముస్లిం విద్యార్ధులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతి, విద్యా వికాసమే ధ్యేయంగా వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని పేర్కొన్నారు.


పేదరికంలో ఉన్న మైనార్టీ ఆడపిల్లలు, విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. స్కూల్ డ్రాపౌట్ కాకుండా ఉండేందుకు వక్ఫ్ బోర్డు తన సొంత వనరుల ద్వారా దాదాపు రూ.5 కోట్ల ఖర్చుతో విద్యార్థులను చదివించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని తెలిపారు. 10వ తరగతిలో 450 మార్కులకు తగ్గకుండా అర్హత సాధించిన విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష ద్వారా ఎంపిక చేసి ఉచిత రెసిడెన్షియల్ విద్య కార్యక్రమాన్ని అందిస్తున్నట్లు మంత్రి ఫరూక్ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యారాడ బీచ్‌లో గల్లంతైన బీటెక్ విద్యార్థి మృతదేహం లభ్యం

కాటేజీ అప్పగించని వైసీపీ ఎమ్మెల్యే.. స్పందించిన శ్రీశైలం దేవస్థానం సభ్యుడు

For More AP News And Telugu News

Updated Date - Jun 14 , 2026 | 06:57 PM