గ్యాస్ కొరతపై హోటల్స్ అసోసియేషన్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 09:21 PM
కమర్షియల్ గ్యాస్ వినియోగం తగ్గిస్తే కొరతను అధిగమించవచ్చని విజయవాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ వెల్లడించారు.
విజయవాడ, మార్చి 11: కమర్షియల్ గ్యాస్ వినియోగం తగ్గిస్తే కొరతను అధిగమించ వచ్చని విజయవాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ వెల్లడించారు. బుధవారం విజయవాడలో కమర్షియల్ గ్యాస్ కొరతపై హోటల్స్ అసోసియేషన్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్విగ్గీ, జొమాటో ఆన్‌లైన్ వ్యాపారాల్లో డిస్కౌంట్ ఆపాలని ఈ సందర్భంగా అసోసియేషన్ నిర్ణయించింది.
రెండో విడతలో పూర్తిగా ఆన్‌లైన్ వ్యాపారం ఆపేస్తామని ప్రకటించింది. ప్రతి సోమవారం రెస్టారెంట్లు పూర్తిగా మూసి వేస్తామని హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. వీక్లీ హాలిడే ప్రకటిస్తే కొంత వరకు గ్యాస్ ఆదా అవుతుందని అభిప్రాయపడింది. గ్యాస్ పంపిణీలో కొరత లేకుండా చూడాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి హోటల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. అలాగే బ్లాక్ మార్కెట్ జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ కోరారు.
ఇప్పుటికే కృత్రిమ కొరత ఉందంటున్న డీలర్లు..
యుద్దం వల్ల కమర్షియల్ గ్యాస్ వినియోగం తగ్గించాలని కేంద్రం ఇప్పటికే ప్రకటన చేసిందని ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు స్వామి వెల్లడించారు. దీనిని డీలర్లు సాకుగా చూపి ఇప్పుడే కృత్రిమ కొరత ఉందని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరతపై సీఎం చంద్రబాబు కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని చెప్పారు. కర్ణాటకలలో కొన్ని హోటల్స్‌లో టీ, కాఫీలను మాత్రమే అమ్మబడునని బోర్డు పెట్టారన్నారు. ఏపీలోని అన్ని హోటల్స్ అసోసియేషన్‌లు కలిసి జేఏసీగా ఏర్పాటు చేశామని వివరించారు. కమర్షియల్ సిలిండర్లు కొరత పెరుగుతుందని చెబుతున్నారన్నారు. ఇప్పటి నుంచే గ్యాస్ వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.
డొమెస్టిక్‌కు ఇచ్చిన విధంగా తమకు కమర్షియల్ గ్యాస్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఫ్లైట్‌లో ఫుడ్ సరఫరా ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తమ హోటల్ యజమానులు ఇబ్బందులు గుర్తించి తమకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని చెప్పారు. గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మంత్రి నాదెండ్ల మనోహర్, సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞానప పత్రాలు ఇస్తామన్నారు. భవిష్యత్తులో గ్యాస్ కొరత వస్తున్నందున ఇప్పటి నుంచే తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ మధ్య కాలంలో ఫంక్షన్లు కూడా ఎక్కువుగా ఉన్నాయని గుర్తు చేశారు. తాము ఆహార పదార్థాలు ధరలు పెంచుతామనేది అబద్ధపు ప్రచారమని స్పష్టం చేశారు.
తమ వైపు నుంచీ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. జుమాటో, స్విగ్గీ ఆన్‌లైన్ ఆర్డర్లు స్టార్ హోటల్స్‌లో త్వరలోనే నిలిపి వేస్తామన్నారు. ఈ ఇబ్బందులు అధిగమించేలా ఎలక్ట్రికల్, బయో గ్యాస్ అందుబాటులోకి తేవాలని కేంద్రం ప్రతిపాదించిందని వివరించారు. దీని వల్ల వేల మంది కార్మికులు వీధిన పడతారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. స్ట్రీట్ నుంచి స్టార్ హోటల్ వరకు గ్యాస్ ఇబ్బందులు తప్పవని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలు చేస్తే.. వినియోగం తగ్గించేలా తమ వంతు సహకారం అందిస్తామని ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాకినాడలో పెద్దపులి.. అధికారుల అలర్ట్
బుల్లెట్ వేగంతో నడుస్తున్న డబుల్ ఇంజన్ సర్కార్: దేవినేని ఉమా
For More AP News And Telugu News