బుల్లెట్ వేగంతో నడుస్తున్న డబుల్ ఇంజన్ సర్కార్: దేవినేని ఉమా
ABN , Publish Date - Mar 11 , 2026 | 09:05 PM
వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. బుధవారం రాజధాని అమరావతిలో దేవినేని ఉమా మాట్లాడుతూ.. దోచుకో.. పంచుకో.. తినుకో.. ఆ నినాదం వైసీపీ పేటెంట్ హక్కు అని స్పష్టం చేశారు.
అమరావతి, మార్చి 11: వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. బుధవారం రాజధాని అమరావతిలో దేవినేని ఉమా మాట్లాడుతూ.. దోచుకో.. పంచుకో.. తినుకో.. ఆ నినాదం వైసీపీ పేటెంట్ హక్కు అని స్పష్టం చేశారు. ఐదేళ్ళు ఆర్థిక విధ్వంసానికి పాల్పడి ఇప్పుడు కాగ్ నివేదకను వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టే పనులు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ శ్రీరంగ నీతులు చెప్పి.. ఢిల్లీలో తెల్లజెండా ఎత్తుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వంతో పోల్చితే దాదాపు 45 శాతం వరకు సంక్షేమ పథకాలకు కూటమి ప్రభుత్వం అదనంగా ఖర్చు చేస్తుందని వివరించారు. అభివృద్ధి - సంక్షేమంతో రాష్ట్రంలో కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్.. బుల్లెట్ వేగంతో నడుస్తుందని పేర్కొన్నారు. పరదాలు కట్టుకొని పరిపాలన చేయడం చేతగాక 11 సీట్లకు పరిమితమయ్యారంటూ వైసీపీ నేతలను ఎద్దేవా చేశారు.
అన్న క్యాంటీన్, తల్లికి వందనం, ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్, అన్నదాత సుఖీభవ పథకాలతో కూటమి ప్రభుత్వం అగ్రస్థానం కల్పించిందని పేర్కొన్నారు. రూ. లక్షల కోట్లు అప్పులు చేసి, రూ. వేల కోట్ల పెండింగ్ బిల్లులు వదిలి నేడు రాష్ట్ర ఖజానా, మినిమమ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడటం సిగ్గు చేటు అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ చూసి ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వస్తున్నాయని సీనియర్ నేత దేవినేని ఉమా చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్.. తెలంగాణకు మచ్చ: బీజేపీ ఎంపీ
For More AP News And Telugu News