Share News

విజయవాడలో అగ్ని ప్రమాదం.. కారు దగ్ధం

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:16 PM

విజయవాడలోని కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ సమీపంలో రహదారిపై కారులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై..కారులో ప్రయాణిస్తున్న వారికి తెలిపారు.

విజయవాడలో అగ్ని ప్రమాదం.. కారు దగ్ధం
Vijayawada Car Fire Near Kanaka Durga Flyover

విజయవాడ, ఏప్రిల్ 06: నగరంలోని కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ సమీపంలో రహదారిపై కారులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై..కారులో ప్రయాణిస్తున్న వారికి తెలిపారు. వారు వెంటనే కారు ఆపి అందులో నుంచి దిగిపోయారు. ఆ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కారు దగ్ధమైంది.


షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. రద్దీ ప్రాంతమైన కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు రంగ ప్రవేశం చేసి.. రహదారిపై నుంచి కారును పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితుల కస్టడీ.. తీర్పు వాయిదా వేసిన కోర్టు

గత పాలకుల వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 06 , 2026 | 05:24 PM