Share News

చంద్రబాబు బూట్లు తుడిచి మాట్లాడు.. కొడాలి నానిపై ఎమ్మెల్యే రాము ఫైర్

ABN , Publish Date - May 28 , 2026 | 12:56 PM

వైసీపీ నేత కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు బూట్లు తుడిచిన తర్వాతే కొడాలి నాని.. రాజకీయాల గురించి మాట్లాడాలన్నారు.

చంద్రబాబు బూట్లు తుడిచి మాట్లాడు.. కొడాలి నానిపై ఎమ్మెల్యే రాము ఫైర్
Venigandla Ramu

కృష్ణా జిల్లా, మే 28: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు బూట్లు తుడిచిన తర్వాతే కొడాలి నాని రాజకీయాల గురించి మాట్లాడాలన్నారు. ‘ప్రస్తుత పరిస్థితిలో కొడాలి నాని కార్పొరేటర్‌గా కూడా గెలవలేడు.. ఇది నా చాలెంజ్’ అని ఎమ్మెల్యే అన్నారు. గుడివాడ ప్రజలు 53 వేల ఓట్ల తేడాతో ఓడించినా కొడాలి నానికి ఇంకా బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియా ముందు మాట్లాడడం కాదని.. దమ్ముంటే గుడివాడ రావాలని సవాల్ విసిరారు. చేతనైతే గుడివాడ ప్రజలకు సాయం చేసి చూపించాలన్నారు.


గుడివాడలో నాని సీటు ఖాళీ అని.. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం దండగ అంటూ వెనిగండ్ల రాము వ్యాఖ్యానించారు. గుడివాడ ప్రజలు కొడాలి నానిని మరిచిపోయి చాలా కాలం అయిందన్నారు. రాజకీయాలలో కొంతమందిని ఎన్నిసార్లు అవమానించినా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సమాజం ఛీ కొడుతున్నా కొడాలి నాని సిగ్గు శరం లేకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. మోదీ, చంద్రబాబు స్థాయి ఏంటి.. కొడాలి నాని స్థాయి ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఏం సాధించావని విమర్శలు చేస్తున్నావని మాజీ మంత్రిని ఎమ్మెల్యే ప్రశ్నించారు.


పేపర్ మీద రాసిన స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని జగన్ ఎక్కడ.. రాజకీయ పరిజ్ఞానం కలిగిన చంద్రబాబు, మోదీ ఎక్కడ అని రాము అన్నారు. ‘అమరావతిపై మాట మార్చిన వ్యక్తి జగన్.. మాట మీద నిలబడే వ్యక్తి ఎలా అవుతాడు. ఓడిపోతే చంద్రబాబు బూట్లు తుడుస్తా అన్నావ్.. ఎప్పుడు తుడుస్తావో చెప్పాలి. పనికిమాలిన వైసీపీ నాయకులు సోషల్ మీడియా రీల్స్ కోసం మాట్లాడడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. నువ్వు గుడివాడలో యాక్టివ్ అవ్వటమే మాకు కావాలి.. రా క్షేత్రస్థాయిలో తేల్చుకుందాం. గుడివాడపై రాజకీయ పరిజ్ఞానం లేని కొడాలి నాని రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడడం అవసరమా’ అంటూ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

గాయపడిన సింహాన్ని.. మరింత కసితో వేటాడతా: అభినయ్ దర్శన్

కార్యకర్తలు, నాయకులకు మనోధైర్యం చంద్రబాబు, లోకేశ్: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 01:02 PM