Share News

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా విజయవాడను అభివృద్ధి చేస్తా: వంగవీటి రాధాకృష్ణ

ABN , Publish Date - Nov 04 , 2026 | 09:37 PM

బెజవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా విజయవాడను అభివృద్ధి చేస్తా: వంగవీటి రాధాకృష్ణ
వంగవీటి రాధాకృష్ణ

విజయవాడ, నవంబర్ 4: బెజవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడారు. తనపై అభిమానం చూపిన ప్రజలందరికీ రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా విజయవాడను అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడానికి స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని చెప్పారు.


తన తండ్రి బాటలో పేదలకు అన్ని రకాల సంక్షేమ ఫలాలు అందేలా చూస్తానని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. కూటమి పార్టీల నేతలను‌ కలుపుకొని ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని వివరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల సహకారంతో కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానని పేర్కొన్నారు. కొండ ప్రాంతాల‌ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు.


ఈ వార్తలూ చదవండి

పేపర్ లీకేజీలకు చెక్‌పెట్టేలా నూతన విధానం.. సీఎం చంద్రబాబుతో నందన్ నీలేకని చర్చలు

డీఎస్పీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2,721 పోస్టులతో నోటిఫికేషన్ జారీకి ఛాన్స్

Updated Date - Nov 04 , 2026 | 09:43 PM