సినీ రంగానికి జానకి అందించిన సేవలు చిరస్మరణీయం: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Aug 21 , 2026 | 03:57 PM
ప్రముఖ సినీ నటి, పద్మశ్రీ షావుకారు జానకి మృతిపట్ల ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో సుమారు 400 చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారన్నారు.
అమరావతి, ఆగస్టు 21: ప్రముఖ సినీ నటి, పద్మశ్రీ షావుకారు జానకి మృతిపట్ల ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో సుమారు 400 చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారన్నారు. షావుకారు సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారని అన్నారు. వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. సినీ రంగానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. షావుకారు జానకి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. జానకి కుటుంబ సభ్యులకు మంత్రి లోకేశ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కాగా, కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి షావుకారు జానకి(94) చెన్సైలోని ఆస్పత్రిలో కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన జానకిని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఈరోజు(శుక్రవారం) తుదిశ్వాస విడిచారు.
ఇవి కూడా చదవండి...
వరలక్ష్మీ వ్రతం.. దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
తుళ్లూరులో శివాలయ శంకుస్థాపన మహోత్సవం.. మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు
Read Latest AP News And Telugu News