Share News

సాయికృష్ణ అదృశ్యం కేసు.. శ్మశానవాటికలో పోలీసుల విచారణ

ABN , Publish Date - Jun 20 , 2026 | 03:33 PM

విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సాయికృష్ణ డెడ్‌బాడీని స్వర్గపురి శ్మశానవాటికలో దహనం చేశారని ఆరోపణలు వస్తుండటంతో అక్కడ ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.

సాయికృష్ణ అదృశ్యం కేసు.. శ్మశానవాటికలో పోలీసుల విచారణ
Sai Krishna Missing Case

విజయవాడ, జూన్ 20: విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సాయికృష్ణ డెడ్‌బాడీని స్వర్గపురి శ్మశానవాటికలో దహనం చేశారని ఆరోపణలు వస్తుండటంతో అక్కడ ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. మే 24, 25 తేదీల్లో స్వర్గపురి శ్మశానంలో జరిగిన గుర్తుతెలియని మృతదేహాల దహనంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మే 23వ తేదీ రాత్రి 8 గంటలకు రెండు గుర్తుతెలియని మృతదేహాలను స్వర్గపురికి తీసుకువచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత స్వర్గపురిలోకి మృతదేహాలకు ప్రవేశం ఉండదు. దీంతో స్థానిక శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఫోన్‌లో చెప్పటంతో రెండు మృతదేహాలను సిబ్బంది స్వర్గపురి మార్చురీలో ఉంచారు.


రెండు మృతదేహాలను మే 24న ఖననం చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ రెండు మృతదేహాలు 40 ఏళ్లు పై బడిన వారివిగా రికార్డుల్లో నమోదు అయ్యింది. 23 ఏళ్ల యువకుడిని దహనం చేసినట్లుగా ఎలాంటి రికార్డు నమోదు కాలేదు. స్వర్గపురిలో ఎలక్ట్రిక్ దహనాలు చేసే బాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం బాషాను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాషా ఫోన్‌ను సీఐ పవన్ కిషోర్ స్వాధీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

‘హైదరాబాద్ ప్లస్‌గా అమరావతి నిర్మాణం’.. జాతీయ మీడియాతో సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 20 , 2026 | 05:05 PM