‘హైదరాబాద్ ప్లస్‌గా అమరావతి నిర్మాణం’.. జాతీయ మీడియాతో సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 20 , 2026 | 02:10 PM
విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని.. ఈ ఏడాది యోగా డేను అమరావతిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమంపై జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.
అమరావతి, జూన్ 20: విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని.. ఈ ఏడాది యోగా డేను అమరావతిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమంపై జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లాలనేదే తమ లక్ష్యమని.. ఓ మిషన్ మోడ్‌లో యోగాను అందరికీ చేరువ చేస్తామన్నారు. సైబరాబాద్ నిర్మాణం తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం చేసే అవకాశాన్ని భగవంతుడు తనకు ఇచ్చారని తెలిపారు. సైబరాబాద్, హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్నాయని, అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఎదిగిందని చెప్పారు.
హైదరాబాద్ ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం వెల్లడించారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ, ఆధ్యాత్మిక నగరంగా అమరావతి నిర్మాణం చేస్తున్నామన్నారు. టెక్నాలజీని అనుసంధానించి ఓ అధునాతన రాజధానిని నిర్మిస్తున్నామని చెప్పారు. నాలెడ్జ్ హబ్‌గా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు. యోగాతో బాబా రామ్‌దేవ్ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ చేరువయ్యారన్నారు. యోగాను ఇంటింటికీ తీసుకెళ్లేలా బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. యోగా ప్రపంచానికి భారత్ ఇచ్చిన ఓ అమూల్యమైన బహుమతని.. ఇలాంటి యోగాతోనే మానసిక ఒత్తిడి దూరం చేసుకుని ఏకాగ్రత సాధించగలమని వెల్లడించారు. టెక్నాలజీ ఒక్కటే సంపద తెచ్చిపెట్టదన్నారు. భారత్‌కు ఉన్న అత్యంత అమూల్యమైన శక్తి ఆధ్యాత్మికత, సంస్కృతి అని తెలిపారు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ యువత ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
ఇవి కూడా చదవండి..
యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద: సీఎం చంద్రబాబు
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News