Share News

SIRపై అప్రమత్తంగా ఉండాలి.. లేకపోతే నష్టపోతాం: మంత్రి తుమ్మల నాగేశ్వరావు

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:26 PM

SIR పై అప్రమత్తంగా లేకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 3,02,800 ఓట్లు ఉంటే అందులో సగం ఓట్లు కూడా మ్యాపింగ్ కాలేదన్నారు.

SIRపై అప్రమత్తంగా ఉండాలి.. లేకపోతే నష్టపోతాం: మంత్రి తుమ్మల నాగేశ్వరావు
Thummala Nageswara Rao

ఖమ్మం జిల్లా, జూన్ 20: ‘SIR’ పై అప్రమత్తంగా లేకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు(శనివారం) SIR పై ముఖ్య కార్యకర్తలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం నియోజకవర్గంలో 3,02,800 ఓట్లు ఉంటే అందులో సగం ఓట్లు కూడా మ్యాపింగ్ కాలేదన్నారు. లక్షన్నర‌కు పైగా ఓట్లు పోయే పరిస్థితి కనపడుతోందన్నారు. ఇప్పటికైనా అప్రమత్తం కావాలని.. ప్రతి ఒక్క ఓటుని కాపాడుకోవాలన్నారు. ఓట్లను కాపాడుకోలేకపోతే భవిష్యత్తు రాజకీయం లేదని వ్యాఖ్యానించారు.


మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు శాతం ఓట్ల తేడాతోనే గెలవడం జరిగిందని మంత్రి తెలిపారు. SIR కార్యక్రమంలో 55 శాతానికి పైగా ఓట్లు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. అప్రమత్తంగా లేకపోతే తీవ్రంగా నష్టపోతామని అన్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్ ఓడిపోవడానికి కారణాలు, పరిస్థితిలు గుర్తు చేసుకోవాలని నాయకులకు సూచించారు. రాజకీయాల్లో ఉండాలనుకునే వారికి జీవన్మరణ సమస్య తప్పదన్నారు. బీజేపీ కావాలని ఓట్ల తొలగిస్తోందని, మరో పార్టీ మరోలా చేస్తోందని రకరకాల ప్రచారాలు వస్తున్నాయన్నారు. ఈ క్లిష్ట పరిస్థితులలో అప్రమత్తంగా లేకపోతే నష్టపోతామని తెలిపారు. అధికారులకు సహకరించాలని, వారితో కలిసి సమన్వయం చేసుకొని ఓట్లను కాపాడుకోవాలని నేతలకు మంత్రి తుమ్మల నాగేశ్వరావు సూచించారు.


ఇవి కూడా చదవండి..

యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద: సీఎం చంద్రబాబు

నిరంజన్ ఇంటికి బండ్ల గణేష్.. రూ. 5 లక్షల చెక్ అందజేత..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 20 , 2026 | 01:40 PM