Share News

SIR ప్రధాన ఉద్దేశం ఇదే.. ఆందోళన వద్దు: సీఈవో సుదర్శన్ రెడ్డి

ABN , Publish Date - Jun 20 , 2026 | 01:55 PM

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి SIR ప్రారంభమవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫాం అందజేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు

SIR ప్రధాన ఉద్దేశం ఇదే.. ఆందోళన వద్దు: సీఈవో సుదర్శన్ రెడ్డి
Telangana SIR

హైదరాబాద్, జూన్ 20: తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి SIR ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 15 నుంచి జూన్24 వరకు సన్నాహక ప్రక్రియ జరుగుతుందని.. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫాం అందజేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. మిస్‌అయిన వారికి ఫాం 6తో మరోమారు ఎన్యూమరేట్ ఫాం అందజేసే అవకాశం ఉందన్నారు. జులై 31న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల చేస్తామని, జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు సీఈవో వెల్లడించారు.


ఓటరు జాబితాలో ప్రస్తుతం ఎక్కడ ఓటు ఉందో అదే అడ్రస్‌కు ఎన్యూమరేషన్ ఫాం వస్తుందని సీఈవో తెలిపారు. ఆ అడ్రస్‌లో ఓటరు లేకపోతే అతని ఓటు అక్కడ తొలగించబడుతుందన్నారు. ప్రస్తుతం ఉంటున్న అడ్రస్‌తో మళ్లీ ఓటరు ఫాం8తో ఓటును ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. SIR ప్రధాన ఉద్దేశం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమని.. ఓటర్లను తొలగించడం కాదు స్పష్టం చేశారు. 24 ఏళ్లుగా ఇక్కడ ఓటర్ జాబితా శుద్ధి జరగలేదన్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది మృతి చెంది ఉంటారని.. కొందరు వలస వెళ్లి ఉంటారని తెలిపారు. వాటన్నింటినీ సరి చేయడమే SIR ఉద్దేశమని చెప్పారు. ఇందులో రాజకీయ ప్రేరేపితం ఏమీ ఉందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పౌరునికి ఎన్యూమరేషన్ ఫాం ఇస్తారని తెలిపారు. కులం, మతంతో సంబంధం లేకుండా అందరికీ ఫాం ఇస్తారన్నారు. ఎన్యూమరేషన్‌లో ముస్లిం, హిందూ అనే వ్యత్యాసం ఉండదని చెప్పారు. ఒక వర్గం ఓట్లు తొలగిస్తారనే ఆందోళన అవసరం లేదని సీఈవో సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

SIRపై అప్రమత్తంగా ఉండాలి.. లేకపోతే నష్టపోతాం: మంత్రి తుమ్మల నాగేశ్వరావు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 20 , 2026 | 02:41 PM