Share News

పవన్ కల్యాణ్ రాజీనామా ప్రచారంపై జనసేన ఫైర్.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు

ABN , Publish Date - Oct 22 , 2026 | 10:16 AM

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఛానల్ పెడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం కార్యాలయం, జనసేన నేతలు స్పందించారు.

పవన్ కల్యాణ్ రాజీనామా ప్రచారంపై జనసేన ఫైర్.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు
Jana Sena Party

అమరావతి, అక్టోబర్ 22: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛానల్.. పెడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం కార్యాలయం, జనసేన నేతలు స్పందించారు. ఆ అబద్ధపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పదవికి రాజీనామా చేస్తున్నారంటూ, త్వరలో ఒక కీలకమైన వార్త రాబోతోందంటూ విష ప్రచారం చేయడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందంటూ మెసేజ్ తిప్పుతుండటంపై ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంపై జనసేన నేతలు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మెసేజ్ సర్క్యూలేట్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది.


వైసీపీ నేతలే వెనకుండి ఈ విష ప్రచారాన్ని చేస్తున్నారంటూ జనసేన నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక.. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ ప్రచారం చేసేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని‌ జనసేన నేతలు విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో వర్ష సూచన.. కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అమిత్ షాకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 22 , 2026 | 10:50 AM